epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కారేపల్లిలో ‘డీజిల్’ గండం..

కారేపల్లిలో ‘డీజిల్’ గండం..
ఆగమ్యగోచరంగా అన్నదాతల పరిస్థితి!
బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ.. గంటల తరబడి నిరీక్షణ
హార్వెస్టర్ యజమానుల షరతులతో రైతులపై అదనపు భారం
స్తంభించిన రవాణా వ్యవస్థ.. నిలిచిపోయిన ఇతర రాష్ట్రాల లారీలు
అకాల వర్షాల భయంతో రైతాంగం ఆందోళన

కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండల పరిధిలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న డీజిల్ కొరత ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఒకవైపు వేసవి ఎండలు ముదురుతుండటం, మరోవైపు మొక్కజొన్న కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఇంధనం దొరక్కపోవడం రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. మండల కేంద్రంలోని గొల్లగూడెం పెట్రోల్ బంకు వద్దకు డీజిల్ కోసం కిలోమీటర్ల మేర వాహనాలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం మండలంలో మొక్కజొన్న పంట చేతికి వచ్చింది. అయితే, కోత మిషన్ల (హార్వెస్టర్ల) యజమానులు డీజిల్ బాధ్యతను రైతులపైనే నెట్టేస్తున్నారు. “బంకుల్లో స్టాక్ ఉండటం లేదు. మీరే డీజిల్ తెచ్చి పోస్తేనే మేము పంట కోస్తాం, లేదంటే మిషన్లు కదిలించలేం” అని తెగేసి చెబుతుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఇతర పనులు మానుకుని, తెల్లవారుజాము నుంచే ప్లాస్టిక్ క్యాన్లతో బంకుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. డీజిల్ సంక్షోభం ప్రభావం రవాణా రంగంపై కూడా పడింది. ఇతర రాష్ట్రాల నుంచి సరుకుతో వస్తున్న లారీలు గొల్లగూడెం సమీపంలోనే నిలిచిపోయాయి. గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంకుల వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం లేక ప్యాసింజర్ ఆటోలు కూడా పక్కన చేరడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం కష్టంగా మారింది.

తక్షణ చర్యలు తీసుకోవాలి
ఆకాశంలో మబ్బులు కనిపిస్తుండటంతో, ఎక్కడ అకాల వర్షం కురిసి పంట తడిసిపోతుందోనని రైతులు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంట, కేవలం డీజిల్ లేకపోవడం వల్ల కళ్ల ముందే నాశనమవుతుంటే చూడలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని, బంకులకు అదనపు స్టాక్ సరఫరా అయ్యేలా చూడాలని, వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకోవాలని ‘కాకతీయ’ డిమాండ్ చేస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.