ధర్మారంలో అంబేడ్కర్ విగ్రహ కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా మారేపల్లి అజయ్ కుమార్
ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం 1, 2 వార్డుల పరిధిలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక కౌన్సిలర్లు పోలు బిక్షపతి, వేణు రావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీ బాధ్యులను ఎంపిక చేశారు. కమిటీ అధ్యక్షుడిగా మారేపల్లి అజయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా కిరణ్ రావు, సంపత్, ఎండి సలీం, శనిగరపు వీరస్వామి నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రధాన కార్యదర్శులుగా శ్రీనివాస్, రాజశేఖర్, కోశాధికారిగా జనార్ధన్ ముస్తఫా బాధ్యతలు స్వీకరించారు. ప్రచార కార్యదర్శులుగా బండి ప్రభాకర్, సమ్మిరెడ్డి ఎంపికయ్యారు. కమిటీ సభ్యులుగా సముద్రాల క్రాంతి కుమార్, నాగరాజు, అరుణ్ కుమార్, మారేపల్లి అంజి, రావుల మధు, మేడి మహేందర్, నెల్లి అశోక్, తలగంపరాజు, సముద్రాల విజయ్, అక్బర్ బాషా తదితరులు నియమితులయ్యారు.

