epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆధునిక సాగుతోనే రైతుకు ఆర్థిక పురోగతి

ఆధునిక సాగుతోనే రైతుకు ఆర్థిక పురోగతి
గ్రామ స్థాయికి శాస్త్రవేత్తలు..
రైతులకు ప్రత్యక్ష మార్గదర్శకం
ఖమ్మం జిల్లాలో త్వరలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
యూరియా వాడకం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ దివాకర

కాకతీయ, ర‌ఘునాథ‌పాలెం/ మయూరి సెంటర్ : ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే రైతులకు అధిక ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి ఆయన పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు నేరుగా గ్రామ స్థాయికి వచ్చి రైతులకు సాగు మెళకువలు నేర్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. గత పదేళ్లలో వ్యవసాయ యాంత్రీకరణను విస్మరించారని, ప్రస్తుత ప్రభుత్వం దీనికోసం భారీగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఈ నిధులను రైతులకు ఏ విధంగా ఉపయోగించాలో అన్నదాతలే సూచనలు ఇవ్వాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు.

లాభదాయకమైన ‘ఆయిల్ పామ్’
ఖమ్మం జిల్లా రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు మొగ్గు చూపాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది. ఆయిల్ పామ్ సాగు చేస్తే నాలుగేళ్లలో రూ. 51 వేల సబ్సిడీ అందుతుంది. 40 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం రావడమే కాకుండా, కోతుల సమస్య, మార్కెటింగ్ ఇబ్బందులు ఉండవు. అంతర పంటలుగా పత్తి, మిర్చి, పప్పుధాన్యాలు సాగు చేసుకునే వెసులుబాటు ఉంద‌న్నారు.

ఆహార భద్రత – భూసార రక్షణ
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా దృష్ట్యా భవిష్యత్తులో ఆహార భద్రత కీలక సవాల్‌గా మారబోతోందన్నారు. రైతులు విచక్షణారహితంగా యూరియా వాడటం వల్ల భూసారం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల స్వయంగా రైతు అని, ఆయన తన పొలాల్లో యూరియా వాడకుండా ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. రసాయనాలతో పండించిన పంటల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, సేంద్రియ సాగు (ఆర్గానిక్ ఫార్మింగ్) వైపు రైతులు అడుగులు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు ఉన్న పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.