epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆలయాల ఆదాయాల్లో రాజన్నకు రెండో స్థానం!

ఆలయాల ఆదాయాల్లో రాజన్నకు రెండో స్థానం!
రూ. 93.87 కోట్ల రాబడితో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ‘యాదాద్రి’
రూ. 73.43 కోట్లతో రికార్డు సృష్టించిన రాజరాజేశ్వరస్వామి క్షేత్రం
టాప్-4లో చోటు దక్కించుకున్న కొండగట్టు అంజన్న ఆలయం
గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025-26) దేవాదాయ శాఖ తాజా వెల్లడి
పెరిగిన భక్తుల రద్దీ.. కనువిందు చేసిన ప్రత్యేక ఉత్సవాలు
కాక‌తీయ‌,  కరీంనగర్/వేములవాడ : రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తుల వెల్లువతో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దర్శన టికెట్లు, ప్రత్యేక పూజలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు, హుండీ కానుకల ద్వారా దేవాలయాలకు వచ్చిన వార్షిక ఆదాయ వివరాలను దేవాదాయ శాఖ తాజాగా ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ పెరగడం, మౌలిక వసతుల కల్పన మెరుగుపడటంతో ఆలయాల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో రూ. 93.87 కోట్ల రికార్డు ఆదాయంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం రూ. 73.43 కోట్ల వార్షిక ఆదాయంతో రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రాజన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా మహాశివరాత్రి జాతర, కార్తీకమాస ఉత్సవాలు, శ్రావణ మాస వేడుకల సమయంలో స్వామివారికి సమర్పించిన కోడెల ముడుపులు, హుండీ కానుకల ద్వారా ఈ స్థాయిలో రికార్డు రాబడి వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం రూ. 21.98 కోట్ల ఆదాయాన్ని గడించి రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఆలయ పరిసరాల్లో ప్రభుత్వం చేపట్టిన భారీ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించిన అధునాతన మౌలిక సదుపాయాలు ఆలయ ఖ్యాతిని మరింత పెంచాయి. మంగళ, శనివారాలతో పాటు వారాంతాల్లో (వీకెండ్స్) స్వామివారి దర్శనానికి, హనుమాన్ దీక్షల విరమణకు మునుపెన్నడూ లేని విధంగా దీక్షాపరులు, భక్తులు తరలిరావడంతో అంజన్న ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు దేవాదాయ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.