రైతులు అధైర్యపడొద్దు : జిల్లా కలెక్టర్ కె. హైమావతి
కాకతీయ, చేర్యాల : జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని రైతులు సంయమనం పాటిస్తూ అధికారులతో సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి విజ్ఞప్తి చేశారు. సోమవారం కోహెడ మండలంలోని వెంకటేశ్వరపల్లి లోని ఆధునిక మార్కెట్ కమిటీ మరియు చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లోని గోదాములో ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ…
జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతుందని వేగవంతం చేయడానికి మిల్లులకు కాకుండా అందుబాటులో ఉన్న గోదాం లో ప్రస్తుతానికి దిగుమతి చేస్తున్నామని తెలిపారు.కోహెడ లోని గోదాం వద్ద ధాన్యం ట్రాక్టర్ లైన్ చాలా పెద్దదిగా ఉన్నందున ప్రతి ట్రాక్టర్ కి టోకెన్ ఇచ్చి ఒక ప్రణాళిక ప్రకారం వేగంగా దిగుమతి చేసేలా పనిచేయాలని మార్కెట్ కమిటీ మరియు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.అనంతరం చేర్యాల మార్కెట్ కమిటీ ని పరిశీలించి చేర్యాల ఏఏంసి లో ధాన్యాన్ని మొత్తం గోదాములో దిగుమతి చేసిన తర్వాతనే వేరే సెంటర్ ల నుండి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చెయ్యాలని సిబ్బందిని ఆదేశించారు.రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని హమాలీ మరియు లారీల కొరత ఉన్నందున వేగంగా జరగడం కోసం అధికార యంత్రాంగం శాయశక్తిలా పనిచేస్తుందని సంయమనం పాటిస్తూ సహకరించాలని జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.

