గ్రామాభివృద్ధిలో పిల్లలూ భాగస్వాములే
మానకొండూరులో ‘చిల్డ్రన్ పార్లమెంట్ – బాల పంచాయత్’
బాలల సమస్యలపై చర్చించే వేదికగా అవగాహన సదస్సు
పాఠశాలల్లో స్నేహిత సీక్రెట్ బాక్సుల ఏర్పాటు
ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్: గ్రామీణ ప్రాంతాల్లో బాలల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన ‘చిల్డ్రన్ పార్లమెంట్ – బాల పంచాయత్’ సదస్సు మానకొండూరులో ఘనంగా జరిగింది. బాలల హక్కుల పరిరక్షణకు, నాయకత్వ లక్షణాల కోసం ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాలల్లో విద్యార్థినులు సమస్యలను రాతపూర్వకంగా తెలపడానికి ‘స్నేహిత’ సీక్రెట్ బాక్సులను ఏర్పాటు చేయనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఎలాంటి వేధింపులు ఉన్నా 8712670759 నంబర్‌కు షీ టీమ్స్‌ను సంప్రదించవచ్చని ఆయన స్పష్టం చేశారు

