స్వచ్ఛ పాఠశాలే లక్ష్యం.. ఇల్లంతకుంటలో బీజేపీ టిఫిన్ బైఠక్
కాకతీయ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామి గౌడ్ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి అడిచెర్ల రాజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించనున్న స్వచ్ఛ పాఠశాల కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బైఠక్ నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం రేపు చేపట్టనున్న స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వెంకట్రావుపల్లె ఉప సర్పంచ్ అనగోని అవినాష్, తిప్పారపు శ్రావణ్, మ్యాకల మల్లేశం, చిమ్మనగొట్టు శ్రీనివాస్, పున్ని సంపత్, లంకోజ్ చంద్రం, కొనబోయిన బాలరాజు, అకేం నాగరాజు, కొనబోయిన పరుశురాం, ప్రశాంత్, పరశురాములు, హరీష్, అజయ్, వినయ్, కనకయ్య, మధు, సంతు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

