epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాజన్న క్షేత్రం.. వైభవానికి కొత్త వెలుగులు!

రాజన్న క్షేత్రం.. వైభవానికి కొత్త వెలుగులు!
రూ.150 కోట్లతో వేములవాడలో మహా అభివృద్ధి యజ్ఞం
దశాబ్దాల భక్తుల కలలకు కార్యరూపం
ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పనుల పురోగతి
దర్శనానికి అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు
రాజన్న క్షేత్ర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు
విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కాక‌తీయ‌, వేములవాడ : తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి నిలువుటద్దంగా నిలిచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ఇప్పుడు చారిత్రక మార్పులకు వేదికగా మారుతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉంటూనే, ఆధునిక సౌకర్యాలతో సరికొత్త శోభను సంతరించుకుంటోంది. రూ.150 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఆలయ రూపురేఖలనే మార్చేసేలా వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా భక్తులు కోరుకుంటున్న ఆలయ విస్తరణకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం దాల్చింది. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, విశాలమైన ప్రాంగణాలు, మెరుగైన దర్శన సౌకర్యాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలతో పనులు చేపడుతున్నారు. సోమవారం ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేవస్థానం ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ అధికారులు, విటిడిఏ ప్రతినిధులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే నిధులు మంజూరయ్యాయని, దేవాదాయ శాఖ, ఉమ్మడి జిల్లా మంత్రుల సమన్వయంతో పనులు అత్యంత నాణ్యతతో కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

సంప్రదాయం..ఆధ్యాత్మికత…
ఆలయ పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా ఆగమ శాస్త్ర నియమాలను పాటిస్తూనే నిర్మాణాలను చేపడుతున్నారు. శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు మహా మండపం, అనిమిటి మండపం, బ్రాహ్మణ సత్రం, కోటి లింగాల ప్రాంగణం, ధర్మగుండం తదితర నిర్మాణాలు ఒకేసారి యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. నిర్మాణాలు కొనసాగుతున్నా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భీమేశ్వర స్వామి ఆలయం ద్వారా ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేస్తూ, భక్తుల రాకపోకలను సులభతరం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

సౌకర్యాల పెన్నిధిగా రాజన్న క్షేత్రం
ఈ విస్తరణ పనులు పూర్తయితే వేములవాడ క్షేత్రం మరింత విశాలంగా, ఆకర్షణీయంగా మారనుంది. భక్తులకు అవసరమైన సౌకర్యాలు గణనీయంగా పెరిగి, దేశవ్యాప్తంగా మరింత మంది భక్తులను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది రూపుదిద్దుకోనుంది. “భక్తుల దశాబ్దాల ఆకాంక్షను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారంతో పనులు వేగవంతం చేశాం. త్వరలోనే భక్తులకు మరింత వైభవమైన దర్శన భాగ్యం కల్పిస్తాం” అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.