పల్లపాటి సోదరులకు ఫోన్‌లో నామా పరామర్శ
కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండలం గిద్దవారిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పల్లపాటి ఉపేందర్ యాదవ్, పల్లపాటి రామకృష్ణ యాదవ్ ల మాతృమూర్తి పల్లపాటి మల్లమ్మ శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం పల్లపాటి సోదరులకు ఫోన్ చేసి పరామర్శించారు. తల్లి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న నామ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి ధైర్యంగా బయటపడాలని, మల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో పల్లపాటి కుటుంబానికి అండగా ఉంటానని మాజీ ఎంపీ భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, సోమవారం నిర్వహించే దశదిన కర్మ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరై నివాళులర్పిస్తానని ఆయన తెలిపారు. నామ నాగేశ్వరరావు పరామర్శ పట్ల పల్లపాటి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు మల్లమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, పల్లపాటి కుటుంబాన్ని ఓదార్చుతున్నారు. అక్షరం ఆయుధం ప్రెస్ క్లబ్ సింగరేణి తరఫున పల్లపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.

