- రసమయి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న విజయ్ కుమార్
- జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడుతో పాటు కీలక నేతలు బీఆర్ ఎస్‌లోకి
కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ ఉపసర్పంచ్ మరియు జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు ఆకుబత్తిని విజయ్ కుమార్ సోమవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితుడై తాను పార్టీలో చేరినట్లు విజయ్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. వీరితో పాటు కేశవపట్నం వార్డు సభ్యులు గొడిశాల రజిత రాములు మరియు పలువురు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, మాజీ జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, నాయకులు గజ్జెల్లి హనుమంతు, గోపు విజయ్ కుమార్, గుర్రం శ్రీకాంత్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, భద్రయ్య, గూల్ల రమేష్, కల్లూరి పోచయ్య, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

