epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్కూల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మకం

స్కూల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మకం
ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన యాజమాన్యం
అధిక ధరలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ
గోడౌన్‌ను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్
ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద పీడీఎస్‌యూ ధర్నా

కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరం బల్లేపల్లిలోని ఎస్.ఎఫ్.ఎస్. మిషనరీ హైస్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం ఆ పాఠశాల పుస్తకాల గోడౌన్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు తిప్పారపు లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎస్.ఎఫ్.ఎస్. మిషనరీ పాఠశాల యాజమాన్యం పుస్తకాలపై ప్రత్యేక లోగోలు వేయించి, తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని విద్యార్థులపై, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. అడ్మిషన్ల సమయంలోనే యూనిఫామ్స్ కూడా తమ వద్దే తీసుకోవాలని నిబంధనలు పెడుతూ, వేల రూపాయలను దండుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారి, నిబంధనలను తుంగలో తొక్కుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

అధికారులు సీజ్ చేయాలి
ప్రైవేటు విద్యాసంస్థల్లో మిషనరీ పేరుతో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తున్న గోడౌన్‌లను వెంటనే సీజ్ చేయాలని, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని మిగిలిన విద్యాసంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టాలని పీడీఎస్‌యూ నేతలు విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి సాదిక్, జిల్లా నాయకులు హరిచంద్ర ప్రసాద్, సుశాంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.