గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ఆగస్టు 2 నుండి 18 వరకు చైతన్య యాత్ర
హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి : కొండం కరుణాకర్
ముదిగొండలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం
కాకతీయ, ముదిగొండ : ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఆగస్టు 2 నుండి 18 వరకు నిర్వహించనున్న అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్‌ను శుక్రవారం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కొండం కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం మరియు వారి హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బాణాపురం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు మరికంటి రామలింగం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు మొక్క నాగేశ్వరరావు గౌడ్, మండల కార్యదర్శి మరికంటి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

