- పాత మామిళ్లవారిగూడెం శివారులో చోటుచేసుకున్న దారుణం
- కేసు నమోదు చేసిన అశ్వారావుపేట పోలీసులు
- పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మర గాలింపు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండలంలోని పాత మామిళ్లవారిగూడెం శివారులో ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై పోక్సో చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఈ అవాంఛనీయ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తమవుతున్నాయి. బాలికలకు రక్షణ కల్పించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

