epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దానం కామెంట్స్ వెనుక లెక్కలేంటి..?

దానం కామెంట్స్ వెనుక లెక్కలేంటి..?
కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే కేసీఆర్ వ్యూహాలకు ప్రశంసలు
‘కేటీఆర్-హరీశ్ బీఆర్ఎస్‌కు పెద్ద అసెట్’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
హైడ్రా, నిధులపై ప్రభుత్వంపై పరోక్ష అసంతృప్తి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ రాజకీయ సందేశమా..?
దానం వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కొత్త చర్చ

కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో మాట్లాడే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తూనే… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలను కొనియాడడం, కేటీఆర్-హరీశ్‌రావులను పార్టీకి ప్రధాన బలంగా అభివర్ణించడం అధికార పార్టీలోనే చర్చకు దారితీసింది. ఇదే సమయంలో హైడ్రా, నియోజకవర్గ అభివృద్ధి నిధులపై ప్రభుత్వంపై పరోక్ష అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన దానం నాగేందర్… “కేసీఆర్ మంచి వ్యూహకర్త. ఫామ్‌హౌస్‌లో ఉన్నా రాజకీయాలను నడిపించగలరు. ఏ అంశాన్నైనా వెంటనే అందిపుచ్చుకునే కేటీఆర్, హరీశ్‌రావులు బీఆర్ఎస్‌కు పెద్ద బలం” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి.

పార్టీ మారినా… రాజకీయ జ్ఞాపకాలు పోలేదా..?

దానం నాగేందర్ రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులు చూసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన ఆయన… అనంతరం కాంగ్రెస్‌కు చేరువయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకుడిగానే వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ నాయకత్వంపై చేసిన సానుకూల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త అర్థాలకు తావిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ అధినేత వ్యూహాలను బహిరంగంగా ప్రశంసించడం సాధారణ రాజకీయ పరిణామం కాదని, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వచ్చిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని పరిశీలకులు అంటున్నారు.

హైడ్రా… నిధులే అసలు అసంతృప్తి కారణమా..?

దానం నాగేందర్ వ్యాఖ్యల్లో మరో అంశం కూడా రాజకీయంగా ప్రాధాన్యం పొందింది. హైడ్రా చర్యల వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల వరకు నిధులు వచ్చేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కొందరు ఎమ్మెల్యే వ్యక్తిగత అసంతృప్తిగా చూస్తుండగా… మరికొందరు అధికార పార్టీలోని స్థానిక నాయకుల భావోద్వేగాలకు ప్రతిబింబంగా విశ్లేషిస్తున్నారు. అన్ని ఊహాగానాలకు తెరదించే ప్రయత్నంలో దానం నాగేందర్ తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని, పార్టీ కోసం ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ నాయకులేనని, పదవుల కోసం ఆశపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఆయన చేసిన రాజకీయ విశ్లేషణలు మాత్రం కొత్త చర్చకు దారితీశాయి.

జీహెచ్‌ఎంసీ రాజకీయాలపై ప్రభావమా..?

హైదరాబాద్ రాజకీయాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల దిశగా క్రమంగా వేడెక్కుతున్న వేళ దానం నాగేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నగరంలో కాంగ్రెస్ సంస్థాగత బలం పెంచే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో… సీనియర్ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రత్యర్థి పార్టీ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రస్తావించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దానం వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలేనా? లేక అధికార పార్టీలోని అంతర్గత అసంతృప్తికి సంకేతమా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు రాజకీయ సందేశమా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం ఈ వ్యాఖ్యలను ఎలా పరిగణిస్తుంది… బీఆర్ఎస్ వాటిని రాజకీయంగా ఎలా వినియోగించుకుంటుంది… అన్నది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశముంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.