ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహణ
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని వినతి
కాకతీయ, రుద్రంగి: ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రుద్రంగి తహసీల్దార్ పుష్పలత కోరారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించగా ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్యలను దరఖాస్తుల రూపంలో అందించి పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజావాణి కన్వీనర్, ఎంపీవో రాజేశ్వర్, ఎస్సై మోతీరాం నాయక్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించి, పెండింగ్ లబ్ధిదారులకు నగదు వెంటనే చెల్లించాలని వార్డు సభ్యులు చెప్యాల గణేష్, ఉప్పులూటీ గణేష్ తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో అండగా ఉన్నాయని, పేదింటి ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకుండా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన పథకాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు.

