ఆర్యవైశ్యుల సమస్యలను
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ
కాకతీయ, గజ్వేల్ : రాష్ట్రంలో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తేవడంతో పాటు ఆర్య వైశ్యులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని రాష్ట్ర పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నాచగిరి శ్రీలక్ష్మి నృసింహ క్షేత్రంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సేవా కార్యక్రమాల్లో నిత్యం ముందుంటున్న ఆర్య వైశ్యులకు సామాజిక భద్రత అవసరం కాగా, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చుని తెలిపారు. ప్రధానంగా చట్టసభల్లో రాజకీయ ప్రాతినిథ్యం లోపించిందని, దీనిని దృష్టిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్య వైశ్యులు ముందుండాలని ఆకాంక్షించారు. పేద ఆర్యవైశ్య యువత, విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుండగా, వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి పేద ఆర్యవైశ్యులను ఆదుకోవాలని కోరారు. అయితే ఆర్యవైశ్య మహాసభ నేతృత్వంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సంక్షేమ అంశాలు ప్రధాన డిమాండ్ గా ప్రభుత్వం ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్య మహిళలు సైతం సేవా, ఆధ్యాత్మిక, ధార్మిక రంగాల్లో ముందుంటున్నట్లు వివరించారు. కాగా మొదటగా ఆర్యవైశ్య జిల్లా మహిళా విభాగం రూపొందించిన శ్రీ వాసవి మాత పారాయణం పుస్తకాన్ని ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గుప్త, రాష్ట్ర మహాసభ కార్యదర్శి శ్రీనివాస్ గుప్త, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నాకర్ గుప్త, అన్నదాన సత్ర చైర్మన్ కొమురవెల్లి శంకరయ్య గుప్త, మండల శాఖ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంకటయ్య గుప్త, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గుప్త, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గుప్త, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మాధవి గుప్త, ప్రధాన కార్యదర్శి లతా గుప్త తదితరులు పాల్గొన్నారు.

