ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు
కాకతీయ, శంకరపట్నం : శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరవుతానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో మే 1న నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కరీంనగర్లో మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహ్వానాన్ని స్వీకరించి కార్యక్రమానికి తప్పక హాజరవుతానని హామీ ఇచ్చారు. గ్రామంలో జరిగే ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా కృషి కొనసాగుతోంది. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు.

