కొలువుదీరిన సివిల్ ఇంజినీర్ల నూతన కార్యవర్గం
చైర్మన్‌గా నల్ల లక్ష్మయ్య, సెక్రటరీగా సబ్బని శ్రీనివాస్
ఘనంగా ప్రమాణస్వీకార మహోత్సవం
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ కన్సల్టెంట్ సివిల్ ఇంజినీర్స్ సెంటర్ (2025–2027) నూతన కార్యవర్గం గురువారం కొలువుదీరింది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు సెక్రటరీ జనరల్ ఆడెపు కాశీరాం ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యవర్గ చైర్మన్‌గా నల్ల లక్ష్మయ్య, సెక్రటరీగా సబ్బని శ్రీనివాస్, ఖజానాదారుగా కోమటి వేణు మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్‌లుగా అన్వర్, ఎల్. రాజు, జి.వి. కిషన్, జగన్ప్రణయ్, స్మరణ్ నియమితులయ్యారు. సహ కార్యదర్శిగా అనిల్, సహ ఖజానాదారుగా ప్రమోద్ బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా భీమనాథుని రంజిత్ కుమార్, ప్రశాంత్, శ్రవణ్, రాజగోపాల్ ప్రమాణం చేశారు. ముఖ్య సలహాదారులుగా పాక పవన్‌కృష్ణ, కోల అన్నారెడ్డి వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, సిద్దిపేట, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సివిల్ ఇంజినీర్లు హాజరై నూతన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంజినీర్ల సంక్షేమం, వృత్తిపరమైన సవాళ్లపై ఐక్యంగా పోరాడుతామని ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు.

