epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బండి ఇది తొండి

బండి ఇది తొండి
కో-ఆప్షన్ ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడ?
బండి సంజయ్‌ది అంతా తొండి రాజకీయం
చట్టవిరుద్ధంగా ఎన్నికల నిర్వహణ
అర్హత లేని వారిని ఎన్నుకుంటే న్యాయపోరాటం తప్పదు
మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోప‌ణ‌లు

కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. నగరంలోని 66 మంది కార్పొరేటర్లకు కనీస సమాచారం లేకుండా ఈ ప్రక్రియను సాగించడం దారుణమన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ అనంతరం జాబితాను బహిర్గతం చేయాల్సి ఉంటుందని రవీందర్ సింగ్ గుర్తుచేశారు. “ఎవరు పోటీ చేస్తున్నారు? వారి అర్హతలు ఏమిటి? క్రిమినల్ కేసులు ఉన్నాయా? వంటి వివరాలు కార్పొరేటర్లకు తెలియకుండా దాచడం వెనుక అంతర్యమేమిటి?” అని ప్రశ్నించారు. రామగుండంలో అర్హత లేని అభ్యర్థుల వల్ల ఎన్నికలు వాయిదా వేసిన అధికారులు, ఇక్కడ అదే చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.

ఇది బీజేపీ అంతర్గత ఎన్నికలా?
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించిన రవీందర్ సింగ్.. “బండి సంజయ్ తొండి చేస్తున్నాడు.. ఇది కౌన్సిల్ ఎన్నికలా లేక బీజేపీ అంతర్గత ఎన్నికలా?” అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఒకలా, గెలిచిన తర్వాత మరోలా వ్యవహరించడం ధర్మం కాదని హితవు పలికారు. కేవలం పత్రికల ద్వారానే వివరాలు బయటకు రావడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మున్సిపల్ యాక్ట్-2019 ప్రకారం ప్రాతినిధ్యం లేని వర్గాలకు అవకాశం కల్పించకుండా, నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పారదర్శకత లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అవసరమైతే ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వెంటనే అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.