epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వంటింట్లో యుద్ధం సెగ‌లు

వంటింట్లో యుద్ధం సెగ‌లు
ఆకాశాన్నంటుతున్న నూనె ధరలు
వంటగది బడ్జెట్‌లో అస్తవ్యస్తం
నెల రోజుల్లోనే వంట నూనెల ధరల్లో 22 శాతం పెరుగుద‌ల‌
రూ. 200 మార్కును దాటిన సన్ ఫ్లవర్ ఆయిల్
పామాయిల్ నూనె ధ‌ర 140 పై మాటే
ఇప్ప‌టికే గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో సగటు జీవిపై భారం

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ సరిహద్దుల్లో మోగుతున్న యుద్ధ భేరీల సెగ ఇప్పుడు నేరుగా భారతీయ మధ్యతరగతి గృహిణి వంటగదికి తగిలిందని, అగ్రరాజ్యాల పంతాల మధ్య సామాన్యుడి వంటింటి బడ్జెట్ అస్తవ్యస్తమవుతోందని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సముద్ర మార్గాల్లో రవాణాను స్తంభింపజేయడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడానికి కారణమవుతున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం ఇక్కడ సామాన్యుడి నూనె ప్యాకెట్ ధరను భారీగా పెంచుతోంది. యుద్ధాన్ని సాకుగా చూపి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం సామాన్యుడి పాలిట శాపంగా మారింది.

నూనె ధరల షాక్

కేవలం నెల రోజుల వ్యవధిలోనే వంట నూనెల ధరలు ఏకంగా 22 శాతం మేర పెరగడం గమనార్హం. ఒకప్పుడు అందుబాటులో ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు కిలో 180 రూపాయల నుండి 200 రూపాయల మార్కును దాటేసింది. పేదవాడికి దన్నుగా ఉండే పామాయిల్ కూడా ఏమాత్రం తగ్గనంటూ 120 నుండి 145 రూపాయలకు చేరుకుంది. ఇక వేరుశనగ నూనె విషయానికి వస్తే కిలోపై 15 రూపాయలు పెరగడమే కాకుండా, 15 కిలోల హోల్ సేల్ టిన్ను ధర 2,400 రూపాయలకు పైగా పలుకుతోంది. రైస్ బ్రాన్, సోయాబీన్, ఆవ నూనె వంటి ఏ నూనెను ముట్టుకున్నా ధరలు షాక్ కొడుతున్నాయి. ఆవ నూనె నుండి వనస్పతి వరకు ప్రతిదీ సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నాయి.

పెరిగిన జీవన భారం

ధరల పెరుగుదల కేవలం నూనెకే పరిమితం కాకుండా అన్ని రంగాలకు విస్తరించింది. ఒకవైపు గ్యాస్ సిలిండర్ ధరలు నిప్పులు కక్కుతుంటే, మరోవైపు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువులన్నీ ప్రియమయ్యాయి. కమర్షియల్ సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో బయట తినలేక, ఇంట్లో వండుకోలేక సగటు జీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా స్థానికంగా కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు గుర్తు చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

యుద్ధ మేఘాల మాటున నక్కిన నల్లబజారు వ్యాపారులు నిల్వలను దాచిపెట్టి ధరలను మరింత పెంచుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే రంగంలోకి దిగి నిల్వ కేంద్రాలపై తనిఖీలు చేపట్టాలని, అక్రమంగా రేట్లను పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వంటింటి బడ్జెట్ అదుపు తప్పకముందే పాలకులు మేల్కొనకపోతే సామాన్యుడి బతుకు భారమై చివరకు కన్నీళ్లే మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలను అదుపులోకి తెచ్చి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.