లింగంపల్లి శేఖర్ మృతిపై వెలిచాల సంతాపం
కాకతీయ, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగంపల్లి శేఖర్ మృతి చెందడం పట్ల కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన శేఖర్ కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన నివాసంలో రాజేందర్ రావు పరామర్శించారు. తొలుత శేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శేఖర్ మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ.. లింగంపల్లి శేఖర్ అత్యంత సామాన్యమైన, మంచి వ్యక్తిత్వం గల నాయకుడని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు నమ్మకంగా సేవలు అందించిన నిబద్ధత గల నేత అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల నరసయ్య, ఆకుల నందిని ఉదయ్, వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, గండి శ్యామ్, గండి గణేష్, లింగంపల్లి శ్రీనివాస్, లింగంపల్లి బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

