కోరపల్లి మత్స్య సంఘం ఎన్నిక ఏకగ్రీవం
అధ్యక్షుడిగా పింగిలి రమేష్ ఎంపిక
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు సభ్యులందరి సమక్షంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎక్కడా పోటీ లేకుండా సభ్యులందరూ ఏకాభిప్రాయంతో కొత్త కమిటీని ఎంపిక చేసుకోవడం విశేషం. సంఘం అధ్యక్షుడిగా పింగిలి రమేష్, ఉపాధ్యక్షుడిగా టంగుటూరి రామ్మోహన్, కార్యదర్శిగా మద్దెర్ల రమేష్ బాధ్యతలు చేపట్టారు. డైరెక్టర్లుగా కొండవేనా పోషాలు, టంగుటూరి సంజీవ్, పింగిలి సంపత్, టంగుటూరి ఉమేష్, తీగల మల్లేష్, టంగుటూరి శ్రీనివాస్‌లను సభ్యులు ఎంపిక చేశారు. జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ అరుణ జ్యోతి ఎన్నికల అధికారిగా వ్యవహరించి, ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు గ్రామస్థులు, సంఘ సభ్యులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఐకమత్యంతో సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. ఎన్నికల అనంతరం కొత్త కమిటీ సభ్యులు ఒకరినొకరు సత్కరించుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

