epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేకుర్తి, విద్యానగర్‌లో ‘22ఏ’ శాపం

రేకుర్తి, విద్యానగర్‌లో ‘22ఏ’ శాపం
ఏడాదిగా నిలిచిన రిజిస్ట్రేషన్లు.. వేల కుటుంబాలు విలవిల
నిషేధిత జాబితాలో పట్టా భూములు.. అనిశ్చితిలో ‘ఆరు వందల’ ఎకరాలు
బ్యాంకు రుణాలు రాక.. ఆస్తుల బదిలీ కాక ఆర్థిక ఇబ్బందులు
మానవతా దృక్పథంతో స్పందించాలని కలెక్టర్‌కు బాధితుల విన్నపం

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పరిధిలోని రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై విధించిన ఆంక్షలు వేలాది కుటుంబాల పాలిట శాపంగా మారాయి. పట్టా భూములను 22/A(1)(d) సీలింగ్ చట్టం కింద నిషేధిత జాబితాలో చేర్చడంతో గత ఏడాది కాలంగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీనిపై సర్వత్రా అనిశ్చితి నెలకొనడంతో బాధితులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రిజిస్ట్రేషన్లు కాక, ఆస్తులు అమ్ముకోలేక, అత్యవసరాలకు బ్యాంకు రుణాలు అందక సుమారు 30 వేల మంది ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు.

రిజిస్ట్రేషన్ల బ్రేక్.. పదివేల ప్లాట్లపై ప్రభావం!
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లోని భూములను అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేర్చడం కలకలం రేపింది.రేకుర్తిలో 125 సర్వే నంబర్లలో దాదాపు 536 ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. విద్యానగర్‌లో 16 సర్వే నంబర్లలోని 115 ఎకరాల భూమిపై ఆంక్షలు విధించారు.
మొత్తంగా ఈ 650 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 6,000 ఇళ్లు, 10 వేలకు పైగా ప్లాట్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ సర్వే నంబర్ల భూములపై క్రయవిక్రయాలు నిలిపివేయడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ సొంత ఆస్తుల మీద తమకే హక్కు లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

40 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?
దశాబ్దాలుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గత 40 ఏళ్లుగా గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల అనుమతులతోనే ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నామని బాధితులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇక్కడ సిమెంట్ రోడ్లు, మిషన్ భగీరథ, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించిందని, పన్నులు కూడా వసూలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు. దశాబ్దాలుగా పట్టా భూములుగా ఉన్న వీటిని అకస్మాత్తుగా సీలింగ్ భూములని ప్రకటించడం అన్యాయమని వాపోతున్నారు.

కలెక్టరేట్‌కు క్యూ కట్టిన బాధితులు
రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించేందుకు సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. “పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ప్లాట్లు అమ్ముకుందామంటే కావడం లేదు.. బ్యాంకులో లోన్ తీసుకుందామన్నా అధికారులు కుదరదని చెబుతున్నారు” అని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని ఈ సర్వే నంబర్లను తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో స్పందించి ఆంక్షలను ఎత్తివేసి, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.