epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి

సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి
జెన్కో నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయాలి
మ్యాన్‌పవర్ లేకుండా ఉత్పత్తి కోసం కార్మికులపై ఒత్తిడి తగదు
ఐఎన్‌టీయూసీ నేతలు మంత్రులతో ఫోటోలకే పరిమితం
ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ధ్వ‌జం
కాకతీయ, కొత్తగూడెం: గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల వివరాలను యాజమాన్యం తక్షణమే ప్రకటించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య డిమాండ్ చేశారు. అలాగే జెన్కో  నుంచి సంస్థకు రావాల్సిన రూ.53,000 కోట్ల భారీ బకాయిలను వెంటనే వసూలు చేసి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా సింగరేణి మనుగడను కాపాడాలన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఇటీవల డైరెక్టర్ (పర్సనల్)తో జరిగిన చర్చల వివరాలను వెల్లడించేందుకు ఆదివారం ఉదయం కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిర్యాల రంగయ్య మాట్లాడుతూ.. కనీస సౌకర్యాలు, కొత్త యంత్రాలు కల్పించకుండా కేవలం ఉత్పత్తి టార్గెట్ల కోసం కార్మికులపై ఒత్తిడి తెస్తూ జీవోలు జారీ చేయడం, మల్టీ డిసిప్లినరీ కమిటీలను వేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
గడిచిన ఆర్థిక సంవత్సరం లాభాల్లో కార్మికుల వాటాను ప్రకటించకుండా యాజమాన్యం కాలయాపన చేస్తూ కార్మికులను మభ్యపెడుతోందని రంగయ్య మండిపడ్డారు. మెడికల్ బోర్డు చర్చల్లో అంగీకరించిన విధంగానే, పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. పాత గనులు మూతబడుతున్న తరుణంలో ఓబీ (ఓవర్ బర్డెన్) పనులను సింగరేణే స్వయంగా టేక్ ఓవర్ చేసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన సింగరేణి ప్రాజెక్టుల లాభనష్టాలపై యాజమాన్యం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన లేబర్ కోడ్‌లను సింగరేణిలో అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. మల్టీ డిపార్ట్‌మెంట్ సమావేశాల పేరుతో పనిగంటలు పెంచి కార్మికులపై భారం మోపడం మానేసి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి మ్యాన్‌పవర్‌ను పెంచాలని, పాత యంత్రాల స్థానంలో ఆధునిక యంత్రాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు.
అధికార సంఘానికి సవాల్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ  తప్పుడు ప్రచారాలతో కార్మికులను మోసం చేస్తోందని రంగయ్య విమర్శించారు. ఐఎన్‌టీయూసీ నాయకులు మంత్రుల చుట్టూ తిరుగుతూ ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదని, అధికార పార్టీగా ఉండి సింగరేణికి జెన్కో నుండి రావాల్సిన ₹53,000 కోట్ల బకాయిలను వసూలు చేయించి చూపించాలని సవాల్ విసిరారు. కాంట్రాక్ట్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, పిట్ కార్యదర్శులు మధు, కృష్ణ, కమల్, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.