epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నన్ను క్షమించండి అమ్మా, నాన్న..

నన్ను క్షమించండి అమ్మా, నాన్న..
మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు.. నీట్ విద్యార్థిని ఆత్మహత్య
వివాదాలతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆకాంక్ష
పేపర్ లీక్ వార్తలతో దిగ్భ్రాంతి.. తల్లిదండ్రుల కల విచ్ఛిన్నం
కూలి పని చేస్తూ.. రూ.3 లక్షల అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించిన పేద తండ్రి

నాగ్‌పూర్ : చదువుతో తమ కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలనే ఒక విద్యార్థిని కల, నీట్ పరీక్షల వివాదం కారణంగా విషాదంగా ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని ఆకాంక్ష చతుర్వేది, పరీక్షలో అక్రమాలు, పేపర్ లీకేజీ వార్తల నేపథ్యంలో తీవ్ర డిప్రెషన్‌కు లోనై నాగ్‌పూర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. నాగ్‌పూర్‌లోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న ఆమె, మే 20న తన గదిలో ఉరివేసుకుని కనిపించింది. తాజాగా లభ్యమైన ఆమె చేతిరాతతో కూడిన సూసైడ్ నోట్, ఆమె మనసులోని ఆవేదనను కళ్లకు కట్టింది. మీ కూతురు బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరిద్దరూ ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, కానీ తనకు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదని ఆకాంక్ష తన చివరి లేఖలో అమ్మానాన్నలను ఉద్దేశించి రాసింది. మొదటి ప్రయత్నంలోనే తనకు మంచి మార్కులు వస్తున్నాయని, కానీ ఇప్పుడు మళ్లీ రాస్తే మంచి మార్కులు వస్తాయనే గ్యారెంటీ లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను క్షమించండి అమ్మా, నాన్న.. నేను అంతా నాశనం చేశానంటూ ఆ లేఖలో పేర్కొంది. ఆకాంక్ష మౌగంజ్ జిల్లాలోని మగానియా గ్రామానికి చెందినది. ఆమె తండ్రి కృష్ణ కుమార్ చౌబే ఒక చిన్న రైతు. తన కూతురి చదువు కోసం ఆయన ఎంతో శ్రమించారు. చిన్న భూమిని సాగు చేయడంతో పాటు, కోచింగ్ ఫీజులు, ఇంటి ఖర్చుల కోసం ఆయన నాగ్‌పూర్‌లో వంటవాడిగా కూడా పనిచేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ ద్వారా సుమారు రూ.3 లక్షల అప్పు తెచ్చి, బంధువుల దగ్గర కూడా సాయం తీసుకుని ఆమెకు కోచింగ్ ఇప్పించారు.

లీకేజీ వార్తలతో తీవ్ర దిగ్భ్రాంతి

పరీక్ష రాసిన తర్వాత ఆకాంక్ష ఎంతో నమ్మకంతో ఇంటికి తిరిగి వచ్చిందని ఆమె బాబాయ్ జగదీష్ ప్రసాద్ చతుర్వేది తెలిపారు. పరీక్ష ముగిశాక ఆమె ఎంతో సంతోషంగా ఉందని, 650 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని తమతో చెప్పిందన్నారు. కానీ పేపర్ లీకేజీ వార్తలు రావడం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం తినడం మానేసి, ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్ర కలత చెందిందని, పరిస్థితి ఇంతవరకు వస్తుందని తాము ఊహించలేదన్నారు. పరీక్ష చుట్టూ ముసిరిన వివాదాలు, అక్రమాల ఆరోపణల వల్ల తన కష్టానికి విలువ లేకుండా పోతుందనే భయం ఆ యువ అభ్యర్థినిని తీవ్రంగా వెంటాడింది. ఈ దారుణ ఉదంతం మౌగంజ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. పోటీ పరీక్షల వివాదాలు, విద్యార్థుల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనేదానికి ఈ ఘటనే నిదర్శనమంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లకోటు వేసుకుని డాక్టర్‌గా సేవ చేయాలనుకున్న కూతురి పుస్తకాలు, నోట్స్ ఆ గదిలో అలాగే ఉన్నా.. ఆ నవ్వుల కూతురు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.