‘మైనింగ్ మాఫియా’ ఇష్టారాజ్యం!
పూడికతీత ముసుగులో మట్టి దోపిడీ
చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట పరిధిలో యథేచ్ఛగా తవ్వకాలు
కాగితాలకే పరిమితమైన నిఘా!
అక్రమ మైనింగ్‌కు అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
అధికారుల పర్యవేక్షణ లోపంపై తీవ్ర విమర్శలు
అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలు ఇకనైనా ఆగేనా
కాకతీయ, చేర్యాల : చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల సర్కిల్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకుండా తవ్వకాలు,అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలు
చేర్యాల పట్టణ పరిధిలో అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఖనిజ సంపదను తవ్వి తరలించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తున్నారు. మైనింగ్ మాఫియా కార్యకలాపాల వల్ల పర్యావరణానికి హాని కలగడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. అక్రమ మైనింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.
అక్రమంగా మట్టి తరలింపు – అధికారుల నిర్లక్ష్యం?
ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చేర్యాల పట్టణ శివారులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఓ రైతు వ్యవసాయ పొలం నుంచి సుమారుగా 2 కిలోమీటర్లు దూరనికి భారీ వాహనాలతో మట్టిని తరలించడం వల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తప్పవు: ఎస్సై అపూర్వ రెడ్డి
ఎవరైనా అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జీ. అపూర్వ రెడ్డి హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఖనిజాల తవ్వకం, రవాణా చేపట్టిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అక్రమ మైనింగ్ సమాచారం ఉంటే వెంటనే ఫోన్ :+91 87126 67356 లేదా 100 డయల్ చేసి పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్సై స్పష్టం చేశారు.

తవ్వకాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి:
– తహసీల్దార్ దిలీప్ నాయక్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి మట్టి, ఇసుక లేదా ఖనిజ తవ్వకాలు చేపట్టాలన్నా సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్ తెలిపారు. అనుమతులు లేకుండా తవ్వకాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా అక్రమ తవ్వకాల సమాచారాన్ని ఫోన్ నెంబర్ :7680906628 కు సమాచారం తెలియజేసి సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా చేర్యాల పట్టణ శివారులోని సుదరయ్య నగర్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఓ రైతు పొలం నుంచి మంగళవారం అక్రమంగా జేసీబీ ( హిటాచ్) సహాయంతో టిప్పర్ ద్వారా మట్టిని తరలిస్తున్న రెండు వాహనాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు.


