12 ఏళ్ల మోదీ పాలన – అభివృద్ధి పథంలో భారత్
* మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
* కొమురవెల్లి మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ
కాకతీయ, చేర్యాల: భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు బుధవారం ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, డిజిటల్ రంగాల్లో,జీఎస్టీ, యూపీఐ వంటి కీలక సంస్కరణలు మోదీ పాలనలో అమలయ్యాయని,గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సాంకేతికత, యువశక్తి, రైతు సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారిస్తోందని తెలిపారు.మోడీ పాలనలో దేశం మరింత ప్రగతి సాధించాలని మల్లికార్జున స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.ఆయన వెంట కొమురవెల్లి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉన్నారు.


