epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అన్ని రంగాల్లో రేవంత్ సర్కార్ వైఫల్యం

అన్ని రంగాల్లో రేవంత్ సర్కార్ వైఫల్యం
రైతు బంధును..రాహుల్ బంధుకు మ‌ళ్లించారు
ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం
ప్రాణం ఉన్నంతవరకు సిరిసిల్ల అభివృద్ధి నా ధ్యేయం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్

కాక‌తీయ‌, రాజ‌న్న‌ సిరిసిల్ల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రభుత్వ తొలి అంకం పూర్తిగా నిరాశపరిచిందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయితే సెకండ్ హాఫ్‌పై ఎలాంటి ఆశలు ఉండవో, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

రైతు బంధును రాహుల్ బంధుగా మార్చారు
రైతుబంధు పథకాన్ని బలహీనపరిచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు మళ్లీ దుకాణాల వద్ద క్యూల్లో నిలబడే పరిస్థితి వచ్చిందని, ధాన్యం కొనుగోళ్లలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. రైతుబంధును బలహీనపరిచి రాహుల్ బంధుగా మార్చారని, తెలంగాణ డబ్బు ఇతర ప్రాంతాలకు తరలిపోతోందని విమర్శించారు. హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు ఇంకేం ఆశించలేరని, ముఖ్యమంత్రికి మాటలు ఎక్కువ, పనులు తక్కువగా ఉన్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, సంక్షేమ పథకాలతో గత భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిందని పేర్కొన్నారు. సిరిసిల్లతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, రాజకీయంగా తనకు పునర్జన్మ ఇచ్చింది సిరిసిల్ల ప్రజలేనని భావోద్వేగంగా చెప్పారు. తన జీవితాంతం సిరిసిల్ల అభివృద్ధికే కృషి చేస్తానని స్పష్టం చేశారు. అధికారం లేకపోయినా ప్రజల ఆదరణ పార్టీకి ఏమాత్రం తగ్గలేదని, ప్రజల సహకారంతో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

డిజిటల్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి
ఈ సందర్భంగా పార్టీ చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.