epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రైవేటు పాఠ‌శాల‌ల‌ ‘దోపిడీ’

ప్రైవేటు పాఠ‌శాల‌ల‌ ‘దోపిడీ’
నిర్దిష్ట దుకాణాల్లోనే కొనాలని యాజమాన్యాల బలవంతం
గ‌రిష్ఠ ధ‌ర‌ల‌తో పుస్తకాల విక్ర‌యాలు.. తల్లిదండ్రులపై పెనుభారం
పుస్తకాల సెట్‌పై కమీషన్ల కోసం భారీగా ధరల పెంపు
అడిగితే ప్రభుత్వ బడిలో చేర్చుకోండంటూ నిర్లక్ష్యపు సమాధానాలు
విద్యాశాఖ అధికారులు స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న‌ తల్లిదండ్రులు

కాక‌తీయ‌, మణుగూరు : భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించే సొమ్మును, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పెను కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి, యాజమాన్యాలు తమకు నచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరుతో కమీషన్ల దందాకు తెరలేపడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు, ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులకు అసలు పొంతనే లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజుగా 15 వేల రూపాయలు అంటే, ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఏకంగా 35 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని వారు వాపోతున్నారు. “మేము చెప్పిన ఫీజు కట్టాల్సిందే, ఇష్టం లేకపోతే టీసీ తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోండంటూ” యాజమాన్యాలు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ యాజమాన్యాలు అడిగినంత చెల్లించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పుస్తకాలపై కమీషన్ల కక్కుర్తి

పాఠశాలల యాజమాన్యాలు నిర్దేశించిన నిర్దిష్ట దుకాణాల నుంచే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు కొనాలని బలవంతం చేయడం మణుగూరులో పరిపాటిగా మారింది. బయట మార్కెట్‌లో 800 రూపాయలకే దొరికే పుస్తకాల సెట్‌ను, వీరు చెప్పిన దుకాణాల్లో 1800 రూపాయలకు కొనాల్సి వస్తోందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పాఠశాల యాజమాన్యాలు, దుకాణదారులు కుమ్మక్కై తల్లిదండ్రులను దోచుకుంటున్నారని, ఇదంతా కేవలం కమీషన్ల కోసమేనని వారు ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల కమిటీ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. అలాగే, పుస్తకాలు, యూనిఫామ్‌లను తల్లిదండ్రులు తమకు నచ్చిన చోట కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ మణుగూరులో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్, అడ్మిషన్, యాన్యువల్ ఫీజుల పేరుతో ప్రతి తరగతికి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

అధికారులు స్పందించాలి.. కోరుతున్న త‌ల్లిదండ్రులు

ఫీజుల దోపిడీపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, ప్రైవేటు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని, నిర్బంధంగా పుస్తకాలు కొనిపించే విధానాన్ని ఆపాలని వారు కోరుతున్నారు. దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ నిద్ర వీడుతుందో లేదో వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.