epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమాలకు ”కల్లెం” పడేనా..?

అక్రమాలకు ”కల్లెం” పడేనా..?
సీసీ రహదారుల నిర్మాణాల్లో నాణ్యత కరువు
ప్రభుత్వ నిబంధనలు గాలికి.. నాసిరకం పనులతో కాంట్రాక్టర్ దందా
అధికార పార్టీ పేరుతో అధికారులకు మామూళ్లు

కాకతీయ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్‌ మండలంలో జరుగుతున్న సిసి రహదారుల నిర్మాణాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ, అధికారులకు ముడుపులు ముట్టజెప్పుతూ పనులను దక్కించుకుంటున్న ఓ కాంట్రాక్టర్ నాణ్యతను గాలికి వదిలేసి, నాసిరకం పనులతో తూతూమంత్రంగా పనులు పూర్తి చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగి, ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా మారాడు. “నాకు పార్టీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి.. ఎన్నో పదవులు అనుభవించాను” అంటూ అధికారులను బెదిరిస్తూ, తమకు కావాల్సినట్లుగా పనులు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో ఇతని వ్యవహారశైలి నచ్చక పెద్దలు పక్కన పెట్టినా, జిల్లా నాయకత్వంలో చోటు సంపాదించుకుని మండలంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. మండలంలోని పలువురు సర్పంచులను తన మాటలతో బురిడీ కొట్టించి, పనుల్లో తనిఖీలు లేకుండా చేసుకుంటున్నాడని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

జాడలేని పాలకవర్గం.. నిరసన బాట పట్టిన గ్రామస్థులు
ఇటీవల పోలేపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను పాలకవర్గం ప్రారంభించినా, ఆ తర్వాత పనులు నాణ్యతగా జరుగుతున్నాయా లేదా అన్నది ఏమాత్రం పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నాణ్యత లేని రోడ్లు మాకు వద్దు” అంటూ శనివారం గ్రామస్థులు పనులను అడ్డుకోవడంతో కాంట్రాక్టర్ అక్కడి నుండి వెనుదిరగాల్సి వచ్చింది. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు స్థానిక పాలకవర్గం పర్యవేక్షించాల్సిన బాధ్యతను గాలికి వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల మౌనం.. ముడుపుల మత్తులో ఆరోపణలు
గత 20 ఏళ్లుగా అధికార పార్టీలో కీలక పదవులు అనుభవించానని, అధిష్టానంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులకు భయపెడుతూ.. నెలనెలా ముడుపులు చెల్లిస్తున్నాడని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పంచాయతీ రాజ్ అధికారులు ఈ నాసిరకం పనులను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ నిధులు వృథా కావడమే కాకుండా, త్వరలోనే రోడ్లు శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.