epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక అక్ర‌మ ర‌వాణాను..వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి

ఇసుక అక్ర‌మ ర‌వాణాను..వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి
ఏపీ నుంచి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి
టీజీఎండీసీ జీఎం ఎల్లయ్యకు లారీ ఓన‌ర్స్‌ అసోసియేష‌న్ నేత‌ల విన‌తి
ర్యాంపుల వద్ద కాంట్రాక్టర్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : ఇసుక అక్రమ రవాణా, ర్యాంపుల వద్ద జరుగుతున్న అదనపు వసూళ్లపై పెద్ద అంబార్‌పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ (జీఎం) ఎల్లయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న లారీ యజమానులకు అక్రమ రవాణా, ఓవర్‌లోడ్ లారీలు శాపంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు పోలగోని భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, కర్నూలు ప్రాంతాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు, చట్టబద్ధంగా పనిచేసే వారికి నష్టం వాటిల్లుతోందని తెలిపారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా డిండి పరిసరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే లోకల్ ఇసుక రవాణా, ఓవర్‌లోడ్ లారీలు ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ర్యాంపుల వద్ద దోపిడీ..
టీజీఎండీసీ నిర్ణయించిన డీడీ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, ర్యాంపుల వద్ద కాంట్రాక్టర్లు ఒక్కో లారీకి అదనంగా రూ.2,500 నుంచి రూ.3,000 వరకు లోడింగ్ పేరుతో వసూలు చేస్తున్నారని ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇసుక రేట్లు తక్కువగా ఉండటం, డీజిల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యజమానులపై, ఈ అక్రమ వసూళ్లు మరిన్ని భారం మోపుతున్నాయని వారు వాపోయారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, ఇసుక ర్యాంపుల వద్ద తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని వారు కోరారు. అనుమతులు లేని లోకల్ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మునుకుంట్ల బలరాం గౌడ్, పేదగోని నర్సింహా, సభ్యులు మునుకుంట్ల శ్రీను, బోయపల్లి ప్రవీణ్, ముక్కర్ల లింగస్వామి, వంటల గణేష్, శంకర్, వర్థం లింగస్వామి, వంటల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.