- హుండీ లెక్కింపులో రూ.1,92,184 ఆదాయం
కాకతీయ, చిగురుమామిడి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సుందరగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. గత పది నెలలుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది సమక్షంలో లెక్కించారు. ఈ సందర్భంగా హుండీ ద్వారా మొత్తం రూ.1,92,184 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కొండపర్తి రాజ్‌కుమార్ తెలిపారు. భక్తులు తమ మొక్కుబడుల రూపంలో నగదుతో పాటు వివిధ రకాల కానుకలను కూడా సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో కరీంనగర్ దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ సహాయ కమిషనర్ శ్రీనివాస్, ఆలయ అర్చకులు శేషం నవీన్ ఆచార్యులు, హుస్నాబాద్ శ్రీ గోమాత సేవాసమితి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

