epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు

ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు
బంతిపూల సాగుతో రైతుకు మంచి ఆదాయం
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
ఆయిల్‌పామ్‌తో 25–30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

కాకతీయ, గంభీరావుపేట : ప్రత్యామ్నాయ పంటల సాగు రైతుల అభివృద్ధికి బాటలు వేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. మంగళవారం గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో క్షేత్రస్థాయిలో సాగు చేస్తున్న ప్రత్యామ్నాయ పంటలను ఆమె పరిశీలించారు. గజసింగవరం గ్రామానికి చెందిన రైతు బోయిని మల్లేశం తనకున్న మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాల్లో జూలైలో బంతిపూల సాగు చేపట్టారు. నాటిన 65 రోజుల నుంచి పూల కోత ప్రారంభమై డిసెంబర్‌ వరకు కొనసాగుతుందని కలెక్టర్‌ తెలుసుకున్నారు. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి పూలను కోయవచ్చని రైతు వివరించారు. ఎకరానికి 45 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని, కిలో బంతిపూలకు సుమారు రూ.60 ధర లభిస్తోందని మల్లేశం తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు 50 శాతం రాయితీ లేదా ఎకరానికి రూ.8 వేల చొప్పున గరిష్ఠంగా ఐదు ఎకరాల వరకు సబ్సిడీ అందుతోందని వివరించారు. దసరా, దీపావళి తదితర పండుగలు, శుభకార్యాల సమయంలో పూలకు డిమాండ్‌ పెరగడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రైతు మల్లేశంను కలెక్టర్‌ శాలువాతో సన్మానించారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతిపూల సాగు చేపట్టి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఇతర రైతులు కూడా మల్లేశంను ఆదర్శంగా తీసుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు.

ఆయిల్‌పామ్‌తో దీర్ఘకాలిక ఆదాయం

రైతులు సంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లావ్యాప్తంగా 17 వేల ఎకరాల్లో కూరగాయలు, పూల మొక్కల సాగుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో 1,250 ఎకరాల్లో కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల సాగు జరుగుతోందని వివరించారు. వీటి ద్వారా రైతులకు నిరంతర ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో 25 నుంచి 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టారని చెప్పారు. మొదటి మూడేళ్లలో అంతర పంటలు సాగు చేసుకుంటూ అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో రైతులను కలిసి సాగు విధానాలు, దిగుబడి, లాభాలపై వివరాలు తెలుసుకుంటూ రైతులకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, గంభీరావుపేట ఎంపీడీవో రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.