epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి
హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు
బాకీ కార్డులతో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడతాం
మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌

కాక‌తీయ‌, హుస్నాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, ప్రతి హామీకి లెక్క చెప్పేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రామగ్రామాన పర్యటించి కాంగ్రెస్‌ హామీల వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడతాయని తెలిపారు. సెప్టెంబరు 2 నుంచి వారం రోజుల పాటు హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి మండలం, మున్సిపాలిటీ, గ్రామం, వార్డులో చేపట్టనున్న కార్యక్రమాలపై ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, వెయ్యి రోజులు పూర్తవుతున్నా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని సతీష్‌కుమార్‌ విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, పేదలు, కార్మికులు, కౌలు రైతులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ప్రజలకు గుర్తు చేసేందుకు బాకీ కార్డుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో ప్రజా అవగాహన కార్యక్రమాలు, నిరసనలు, హామీలపై చర్చలు చేపడతామన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజలతో కలిసి స్థానికంగా పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలు కాంగ్రెస్‌ హామీలను మర్చిపోలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీకి ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందేనని అన్నారు. మండల, గ్రామ, పట్టణ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారం రోజుల కార్యక్రమాలను ప్రజా ఉద్యమంగా మలచాలని వొడితల సతీష్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు

ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు బంతిపూల సాగుతో రైతుకు మంచి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.