1100 దేశీదారు బాటిళ్లు స్వాధీనం
పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు
99 లీటర్ల దేశీదారు, కారు, మొబైల్ స్వాధీనం
నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కాకతీయ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎస్హెచ్ఓ పరిధిలోని పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు, డీటీఎఫ్ ఆదిలాబాద్ బృందం సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా దేశీదారును తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 90 మిల్లీలీటర్ల పరిమాణం కలిగిన 1,100 బాటిళ్లు, మొత్తం 99 లీటర్ల దేశీదారును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మారుతీ సుజుకీ రిట్జ్ కారు, ఓపో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి ఆదిలాబాద్ కోర్టులో హాజరుపరచగా న్యాయ రిమాండ్‌కు తరలించారు.

