గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు
ఇతర ప్రభుత్వ స్థలంలో నిర్మించాలి.. ఎంపీడీవోకు తాడికల్ ఉపసర్పంచ్, వార్డు సభ్యుల వినతి
కాకతీయ,శంకరపట్నం:తాడికల్ గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో నూతనంగా మంజూరైన వీవో భవనాన్ని నిర్మించవద్దని గ్రామ ఉపసర్పంచ్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలో వీవో భవన నిర్మాణం చేపడితే భవిష్యత్తులో పంచాయతీ పరిపాలనా అవసరాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాభావం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల అవసరాలు, భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు.అందువల్ల నూతనంగా మంజూరైన వీవో భవనాన్ని గ్రామంలోని ఇతర ప్రభుత్వ స్థలంలో నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజిమోద్దీన్, సుకొసి శ్రీధర్, రాణవేణి శ్రీకాంత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

