epaper
Monday, November 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గుట్టు బయటపడింది.. యుద్ధం మొదలైంది!

గుట్టు బయటపడింది.. యుద్ధం మొదలైంది!

ఏనుమాముల మార్కెట్‌లో కొనుగోళ్ల బంద్‌కు వ్యాపారుల నిర్ణయం

లింగారెడ్డిపై కేసుతో రగిలిన వ్యాపార వర్గాలు

సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని ఛాంబర్‌ తీర్మానం

తనిఖీల్లో తూకం, హమాలీ, ఈ-నామ్‌ నిబంధనల ఉల్లంఘనలు

ఆదివారం కలెక్టర్‌ నిర్ణయంపై మార్కెట్‌ వర్గాల్లో ఉత్కంఠ

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో తనిఖీలతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు ఇప్పుడు కొనుగోళ్ల బంద్‌ వరకు వెళ్లాయి. ప్రభుత్వం నియమించిన లక్ష్మణుడి బృందం ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన క్షుణ్ణ పరిశీలనలో తూకం, హమాలీ, ఈ-నామ్‌ లావాదేవీల్లో ఉల్లంఘనలు గుర్తించింది. వాటి ఆధారంగా మార్కెట్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో వ్యాపారులు, అధికారుల మధ్య వివాదం మొదలైంది. తాజాగా వ్యాపారి లింగారెడ్డిపై పెనుమాముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో వ్యవహారం మరింత ముదిరింది. సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తీర్మానించింది.

బీట్‌ వద్ద మొదలైన వివాదం.. కార్యదర్శి వరకు కొనసాగింపు

పరిశీలన అనంతరం నోటీసులు జారీ కావడంతో మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. పత్తి బీట్‌ వద్ద జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజుతో వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వ్యాపారి లింగారెడ్డి అధికారిని ఉద్దేశించి మాట్లాడిన తీరు, హెచ్చరికలు చేసినట్లు కనిపిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. మార్కెట్‌కు ఎవరైనా రావచ్చని, ఎవరినీ అడ్డుకునే అధికారం లేదని డీఎంఓ నాగరాజు స్పష్టం చేయగా, బీట్‌ కాల్‌ చేసే అంశంపై లింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌తోనూ వాగ్వాదం చోటుచేసుకుంది. ‘మార్కెట్‌ మాది.. నీవు ఎక్కడి నుంచి వచ్చావు.. నోటీసులు ఇవ్వొద్దంటే ఎందుకు ఇస్తున్నావు’ అంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో లింగారెడ్డిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

తనిఖీల్లో బయటపడిన అక్రమాలు

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వరంగల్‌ నవంబర్‌ 10న జారీ చేసిన నోటీసులు, నవంబర్‌ 4, 5 తేదీల్లో నిర్వహించిన పరిశీలన ఆధారంగా ఇచ్చినవే. వాటిలో పేర్కొన్న మూడు ఘటనలు మార్కెట్‌లో జరుగుతున్న ఉల్లంఘనలను స్పష్టం చేస్తున్నాయి.

కేకే ట్రేడర్స్‌: లక్ష్మి వెంకటేశ్వర ట్రేడింగ్‌ కంపెనీ వద్ద రూ.432, శ్రీ సాయి ఎంటర్‌ప్రైజెస్‌ వద్ద రూ.210 తూకంలో తేడా గుర్తించారు. ఈ రెండు లావాదేవీల్లో కలిపి రూ.642 వ్యత్యాసం నమోదైంది.

గుండు అగయ్య ఏజెన్సీ: ఈ-నామ్‌లో నమోదు చేయకుండా, వేబ్రిడ్జిపై తూకం వేయకుండా వ్యాపారం నిర్వహించారు. హమాలీ పని చేయకుండానే రూ.490 అదనంగా వసూలు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు.

కామాచి ట్రేడర్స్‌: ఈ-నామ్‌ నమోదు లేకుండా, వేబ్రిడ్జి తూకం చేయకుండానే వ్యాపారం నిర్వహించారు. తక్కపట్టీ నంబర్లు 6305/72, 73, 77లను నోటీసులో ప్రస్తావించారు. ఈ మూడు వ్యవహారాలనూ తెలంగాణ వ్యవసాయ మార్కెట్‌ నియమావళి–1969లోని నిబంధన 52(బి), మార్కెట్‌ బైలా నంబరు 25 ఉల్లంఘనల కింద పేర్కొన్నారు.

మరో నాలుగు అంశాల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు

పరిశీలనలో గన్నీ బ్యాగుల ఛార్జీలపై అడ్డీ కమిషన్‌ పేరుతో రెండు శాతం వసూలు చేయడం, లూజ్‌ వాహనాల్లో వచ్చిన మొక్కలు/పత్తికి హమాలీ ఛార్జీలు వసూలు చేయడం, మిర్చి బస్తాల బరువు 49 కిలోలు దాటితే అర కిలో కటింగ్‌ మినహాయింపు ఇవ్వడం, మార్కెట్‌ యార్డుకు రాని సరుకుకు కూడా తక్పట్టి జారీ చేయడం వంటి మరో నాలుగు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

సోమవారం నుంచి కొనుగోళ్లు బంద్‌..!

లింగారెడ్డిపై కేసు నమోదు కావడంతో వ్యాపారులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో సమావేశమైన వ్యాపారులు సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని తీర్మానించారు. ఏనుమాముల మార్కెట్‌ వైపు వెళ్లవద్దని కూడా వ్యాపారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మార్కెట్‌కు పత్తి తీసుకొచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.

ఆదివారం కలెక్టర్‌ ఏం తేల్చనున్నారు..?

ఈ వివాదంపై జిల్లా కలెక్టర్‌ ఆదివారం తీసుకునే నిర్ణయంపై మార్కెట్‌ వర్గాల దృష్టి నెలకొంది. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలు, అధికారులు జారీ చేసిన నోటీసులు, వ్యాపారుల అభ్యంతరాలు, పోలీసు కేసు, కొనుగోళ్ల నిలిపివేత నిర్ణయం.. ఇలా అన్ని అంశాలపై కలెక్టర్‌ సమీక్షించే అవకాశం ఉంది. నిబంధనల అమలుతోపాటు రైతులకు కొనుగోళ్లలో అంతరాయం కలగకుండా చూడటం కీలకం కానుంది. కలెక్టర్‌ నిర్ణయంతో సోమవారం ఏనుమాముల మార్కెట్‌లో కొనుగోళ్లు కొనసాగుతాయా, నిలిచిపోతాయా అన్నది తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కలెక్టర్‌ మేడమ్‌ ఆలోచించండి..!!

కలెక్టర్‌ మేడమ్‌ ఆలోచించండి..!! ఏనుమాములలో మార్కెటింగ్‌ అధికారులకు ఏదీ భరోసా..? నోటీసుల జారీపై వ్యాపారుల...

ఏనుమాముల మార్కెట్‌ యథాతథం.. కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్‌!

ఏనుమాముల మార్కెట్‌ యథాతథం.. కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్‌! రైతులకు ఇబ్బందులు కలగనివ్వం మార్కెట్‌ కార్యకలాపాలు యథావిధిగా...

వాగ్దేవి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

వాగ్దేవి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో మహంకాళి శ్యాంసుందర్‌...

గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యుల‌ర్ స్కాం

గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యుల‌ర్ స్కాం కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు యూనియ‌న్ నేత‌ల వ‌సూళ్లు ఉద్యోగాల‌ను...

భట్టి పర్యటన వేళ.. వినయ్‌ భాస్కర్‌ గృహ నిర్బంధం!

భట్టి పర్యటన వేళ.. వినయ్‌ భాస్కర్‌ గృహ నిర్బంధం! వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు...

అర్ధ‌రాత్రి బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు

అర్ధ‌రాత్రి బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు డిప్యూటీ సీఎం రాక నేప‌థ్యంలో పోలీసుల చ‌ర్య‌ పోలీసుల...

భట్టి సారూ మీరైనా ప‌ట్టించుకోండి

భట్టి సారూ మీరైనా ప‌ట్టించుకోండి కాజీపేట ఆర్వోబీపై ఎడ‌తెగ‌ని నిర్ల‌క్ష్యం ఏడేళ్లుగా కొలిక్కిరాని ఫాతిమానగర్‌...

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌!

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌! పోచంపల్లి వర్సెస్‌ చల్లా వ‌ర్గీయుల మ‌ధ్య రాజ‌కీయ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.