చేర్యాల కోర్టులో రాష్ట్ర అవతరణ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సివిల్ జడ్జి శ్రీరామ్
కాకతీయ, చేర్యాల : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం చేర్యాల సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జూనియర్ సివిల్ జడ్జి బానోత్ శ్రీరామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాల ఫలంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అపూర్వ రెడ్డి, న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) అధ్యక్షుడు అరెళ్ల వీరమల్లయ్య, ప్రధాన కార్యదర్శి సుద్దాల రమేష్‌తో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది , అబ్కారి (ఎక్సైజ్), పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

