కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తుమ్ జలపతి
కాకతీయ, రుద్రంగి : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తుమ్ జలపతి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో జరిగిన పార్టీ గ్రామ కమిటీ ఎన్నికల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా జూల దిలీప్, ఉపాధ్యక్షుడిగా బొర్రగల్ల రవి, మండల ఉపాధ్యక్షుడిగా జక్కుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జలపతి మాట్లాడుతూ, గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రతి కార్యకర్త ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని సూచించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జూల దిలీప్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్ జలపతి, జిల్లా కార్యదర్శి జక్కు మోహన్, ఉప సర్పంచ్ దాసరి అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, జక్కు వంశీ, జక్కుల లక్ష్మీ నర్సయ్య, జక్కు లింగారెడ్డి, తిక్క భూమయ్య, లక్కాకుల శ్రీనివాస్, ఇండ్ల లక్ష్మయ్య, నాంచారి రాకేష్, దాసరి శేఖర్, జలంధర్, బాలు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

