epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్దపీట

పేదల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్దపీట
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రోల్‌మోడల్‌
మ‌న ప‌థ‌కాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి
రాష్ట్రంలో 24 వేల కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర‌ అభివృద్ధి
వేములవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

కాకతీయ, చందుర్తి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆది శ్రీనివాస్‌ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 24 వేల కొత్త కుటుంబాలకు రేషన్‌ కార్డులు అందించామని ఆది శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 1.96 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయన్నారు. రేషన్‌ కార్డు కేవలం సరుకుల కోసం మాత్రమే కాకుండా పేద కుటుంబాలకు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు.

అప్పుల భారంలోనూ సంక్షేమం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదని అన్నారు. గత పాలనలో రాష్ట్రంపై భారీగా అప్పుల భారం పడిందని, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆశిరెడ్డిపల్లితో తనకు రాజకీయంగా విడదీయరాని అనుబంధం ఉందని ఆది శ్రీనివాస్‌ గుర్తు చేశారు. 1995లో కొచ్చేరు చెరువుకు గండి పడిన అనంతరం, తాను జడ్పీటీసీగా ఉన్న సమయంలో 1996లో పాదయాత్ర చేసి చెరువు మరమ్మతులకు రూ.45 లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కొచ్చేరు చెరువులోకి నీటిని తీసుకురావడానికి కాలువ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని, భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వేములవాడ మూడో వంతెన నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం తనకు లభించిన అరుదైన అవకాశమన్నారు. ఎన్నికలు కేవలం 15 రోజుల రాజకీయ పోటీ మాత్రమేనని, అనంతరం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. తాను 4 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ 5వసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం పొందానని గుర్తు చేశారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు తన ఎమ్మెల్యే పదవిని అంకితం చేశానని, ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.