epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డీజీపీగా సీవీ ఆనంద్‌!

డీజీపీగా సీవీ ఆనంద్‌!

పోలీస్ బాస్ నియామ‌కం పూర్తి !

నేడో రేపో అధికారిక ఉత్త‌ర్వులు!

మే మొద‌టి వారంలో బాధ్య‌త‌లు !

ఈనెల 30న శివధర్‌రెడ్డి పదవీ విరమణ

ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్

ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియ‌మించిన ప్ర‌భుత్వం

దీంతో డీజీపీగా ఆనంద్‌కు లైన్ క్లియ‌ర్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కొత్త డీజీపీగా 1991వ బ్యాచ్‌ అధికారి సీవీ ఆనంద్‌ పేరు దాదాపు ఖ‌రారైంది. నేడోరేపో రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా వెల్లడించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు ఆయనను ఊరించి నిరుత్సాహ పరిచిన డీజీపీ పదవి.. త్వరలోనే వరించ‌నుంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ బీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేస్తుండగా.. ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్‌ పేరు ప్రకటించనున్నట్టు సమాచారం. సీవీ ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆనంద్ ఉండగా… తాజాగా జరిగిన బదిలీల్లో ఆయన స్థానంలో షికా గోయ‌ల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఆనంద్ చూపిన చొరవ, అనుభవం ప్లస్ పాయింట్లుగా మార‌నున్నాయి. ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు సంస్కరణలను అమలు చేయడంలోనూ ఆయన సమర్థతపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల భారీ బదిలీల ప్రక్రియ కూడా పూర్త‌వ‌డంతో ఇక డీజీపీ నియామకానికి లైన్ క్లియర్ అయింది.

నేడోరేపో ఉత్త‌ర్వులు!

డీజీపీగా తన ఉద్యోగకాలం పొడిగిస్తారని ఆశలు పెట్టుకున్న బీ శివధర్‌రెడ్డి పేరు యూపీఎస్సీ సూచించిన జాబితాలో లేకపోవడంతో ఆయన ఉద్యోగ విరమణ అనివార్యమైంది. దీంతో తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్‌ పేరు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ధన్‌గోపాల్‌ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు శాశ్వతప్రాతిపదికన సీవీ ఆనంద్‌ పేరు ప్రకటిస్తారని సమాచారం. ఈనేపథ్యంలో తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేప‌ట్టారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు యువ ఐపీఎస్‌లతో పాటు, సీనియర్లకు కూడా స్థానచలనం క‌లిగింది. అయితే, సీవీ ఆనంద్‌ రెండేండ్ల డీజీపీ ఉద్యోగ కాలం ముగిసే నాటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై ఎన్నికల కమిషన్‌ వేటువేసిన సంగ‌తి తెలిసిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.