epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టీచ‌ర్ల‌కు అడ్మిష‌న్ల‌ టార్గెట్లు

టీచ‌ర్ల‌కు అడ్మిష‌న్ల‌ టార్గెట్లు
ఒత్తిడితో ప్రైవేటు ఉపాధ్యాయుల అవస్థలు
సెలవుల్లోనూ ఇళ్ల చుట్టూ తిరగాలంటూ యాజమాన్యాల హుకుం
పూర్తి చేయకుంటే ఉద్యోగాలకే ముప్పు
కనీసం సొంత పిల్లల ఫీజులకూ మినహాయింపు లేదు
వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం.. అధికారుల జోక్యానికి డిమాండ్‌

కాకతీయ,మణుగూరు: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. విద్యాసంవత్సరం పొడవునా విద్యార్థులకు మార్కులు, ర్యాంకుల నిమిత్తం ఒత్తిడి తెచ్చే యాజమాన్యాలు.. తీరా వేసవి సెలవులు వస్తే అడ్మిషన్ల టార్గెట్లతో వారి రక్తం తాగుతున్నాయని మణుగూరు నియోజకవర్గంలోని పలువురు ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అడ్మిషన్లు రాబట్టకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతుండటంతో ఉపాధ్యాయులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

జీతం రూ.10 వేలు.. టార్గెట్లు మాత్రం కొండంత!
స్థానిక వివరాల ప్రకారం.. నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా 5 నుంచి 10 అడ్మిషన్లు చేయించాలని యాజమాన్యాలు కఠిన నిబంధనలు పెట్టాయి. ఒక్కో అడ్మిషన్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కమీషన్ ఇస్తామని ఆశచూపి, తీరా చేర్పించాక ఆ డబ్బులు ఎగ్గొడుతున్నారని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారాలు, పండుగ సెలవుల్లోనూ విశ్రాంతి లేకుండా ఇళ్ల చుట్టూ తిరుగుతూ.. ‘మా స్కూల్లోనే చేర్పించండి.. ఫీజులు తగ్గిస్తాం’ అంటూ తల్లిదండ్రుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నెలకు రూ.10 వేల లోపే జీతం తీసుకునే ఉపాధ్యాయులకు వారి స్వంత పిల్లల ఫీజుల్లో కనీస మినహాయింపు ఇవ్వకపోవడం గమనార్హం. తమ పిల్లల చదువుల కోసం నెలకు రూ.5 వేల వరకు స్కూలుకే కట్టాల్సి వస్తోందని, కొందరైతే అప్పులు తెచ్చి మరీ ఫీజులు చెల్లిస్తున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు.

కుటుంబాల్లో చిచ్చు.. అధికారుల పర్యవేక్షణేది?
ఈ అడ్మిషన్ల ఒత్తిడి ఉపాధ్యాయుల వ్యక్తిగత, కుటుంబ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల మణుగూరులోని ఒక పాఠశాలలో పనిచేసే మహిళా టీచర్ రోజంతా అడ్మిషన్ల వేటలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో.. ఆమె భర్త నేరుగా పాఠశాలకే వచ్చి యాజమాన్యంతో గొడవకు దిగినట్లు సమాచారం. ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందిపై జరుగుతున్న ఇటువంటి మానసిక వేధింపులను అరికట్టాలని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్న స్కూళ్లపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.