epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క్రిటిక‌ల్‌గా..క్రిటిక‌ల్ కేర్‌

క్రిటిక‌ల్‌గా..క్రిటిక‌ల్ కేర్‌
రూ.23 కోట్ల ఖర్చు.. చికిత్సలు కరువు..!
రూ.23.75 కోట్లతో భవనం ఉన్నా రోగులకు తప్పని ఇబ్బందులు
డాక్టర్లు, ఆధునిక పరికరాలు లేక వరంగల్, హైదరాబాద్‌లకు రెఫర్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేద రోగులకు దక్కని ఆరోగ్య‌ భరోసా

కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు కీలకమైన క్రిటికల్ కేర్ విభాగం నిరుపయోగంగా మారుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కుమరం భీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాల్సిన ఈ విభాగం, ప్రస్తుతం వైద్యులు మరియు వైద్య పరికరాల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చే రోగులను వరంగల్, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడుతోంది.

రూ. 23.75 కోట్లతో భవనం.. సేవలు మాత్రం శూన్యం

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 8 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ విభాగాల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 23.75 కోట్ల భారీ వ్యయంతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. గుండె సంబంధిత చికిత్సల కోసం క్యాథ్ ల్యాబ్, మూత్రపిండాలు, మెదడు, ఎముకల విభాగాలతో పాటు ఇతర ప్రత్యేక వైద్య సేవలకు సుమారు 50 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఇక్కడ నియమించాల్సి ఉంది. అలాగే అత్యాధునిక పరికరాల నిర్వహణ కోసం సాంకేతిక నిపుణులను కూడా అందుబాటులో ఉంచాలి. అయితే, ఈ భవనం ప్రారంభమై ఏడాది దాటినా ఇప్పటివరకు ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడం గమనార్హం.

అత్యవసర కేసులకు రెఫర్‌లే దిక్కు

ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న పరిమిత వైద్య సిబ్బందే కొన్ని ప్రత్యేక విభాగాల రోగులకు సేవలు అందిస్తున్నారు. రోజుకు సగటున 10 మంది ప్రమాద బాధితులు ఆసుపత్రికి వస్తుండగా, మెదడు సంబంధిత (న్యూరో) చికిత్సల కోసం నెలకు 100 మందికి పైగా రోగులు, ఎముకల అత్యవసర చికిత్సల కోసం 70 నుండి 100 మంది వరకు వస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేక వైద్యులు, ఆధునిక పరికరాలు లేకపోవడంతో వారిని వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు పంపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక పోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.

పరికరాల కొరతతో వెలవెలబోతున్న విభాగం

ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన శస్త్రచికిత్స టేబుళ్లు, వెంటిలేటర్లు, మల్టీపారా మానిటర్లు, పడకలు, ల్యాబ్ సదుపాయాలు తగిన స్థాయిలో లేవని సమాచారం. స్థానిక రోటరీ క్లబ్ అందించిన సీ-ఆర్మ్ పరికరం, అంబులెన్స్‌తోనే కొంత మేర నెట్టుకొస్తున్నారు. ప్రత్యేక వైద్య విభాగాల సంగతి పక్కన పెడితే, సాధారణ శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాల కొరత కూడా తీవ్రంగా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలకు టీచింగ్ హాస్పిటల్‌గా ఉన్న ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, క్రిటికల్ కేర్ విభాగానికి అవసరమైన సౌకర్యాలు కల్పించి, ప్రత్యేక వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని వెంటనే నియమించాలని రోగులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.