epaper
Thursday, October 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి
నవంబర్‌ 6లోగా ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు కావాలి
డీసీసీ కార్యాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రం
వర్ధన్నపేటలో రికార్డు స్థాయిలో నమోదు లక్ష్యం
కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి కృషి చేయాలి
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి

కాకతీయ, హనుమకొండ: వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్‌ 6లోగా అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలని, ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని సూచించారు. ఆదివారం నిర్వహించిన వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వర్ధన్నపేట నియోజకవర్గ సమావేశంలో ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడారు. పట్టభద్రుల ఓటరు నమోదును సులభతరం చేసేందుకు హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని పట్టభద్రులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

48 శాతమే ఓటరు నమోదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో వెల్లడైన వివరాల ప్రకారం వరంగల్‌–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు 48 శాతంగానే ఉందని ఇనగాల తెలిపారు. నమోదు ప్రక్రియ సెప్టెంబర్‌ 28న ప్రారంభమైందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్‌ 6 వరకు మాత్రమే గడువు ఉందని చెప్పారు. గతంలో ఓటు హక్కు ఉన్నవారు సైతం ఈసారి ఫారం–18 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డుల వారీగా పట్టభద్రులను గుర్తించి ఓటరు నమోదును వేగవంతం చేయాలని వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. మండల, డివిజన్‌ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల కంటే ఈసారి వర్ధన్నపేటలో రికార్డు స్థాయిలో ఓటరు నమోదు జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వరంగల్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయ్యూబ్‌, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ టెస్కాబ్‌ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు పాల్గొన్నారు. మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ బయగోని కుమారస్వామి, హనుమకొండ జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె.ఆర్‌.దిలీప్‌రాజ్‌, జవహర్‌ బాల్‌ మంచ్‌ వరంగల్‌ జిల్లా చైర్మన్‌ జన్నపురెడ్డి రుగ్వేద్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌, మండల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం బాదం ప్రవీణ్‌ నామినేషన్‌ ఉపసంహరణ అధ్యక్షుడిగా కాట్రగడ్డ...

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం ఎల్‌నినో కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర...

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్‌ మాదిగ అనారోగ్యంతో...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం! ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే...

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి?

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి? యూత్‌ డిక్లరేషన్‌, మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు,...

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య   హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ...

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి కరీంనగర్‌లో 20 కి.మీ. సైకిల్‌ ర్యాలీ విద్యార్థులు, వైద్యులు,...

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు గొర్రెకుంట నుంచి జాన్‌పీర్ల మీదుగా కొవ్వొత్తుల ర్యాలీ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.