epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామాల్లో సామాజిక మార్పే పోలీసుల లక్ష్యం

గ్రామాల్లో సామాజిక మార్పే పోలీసుల లక్ష్యం
యువత మద్యానికి దూరంగా ఉండాలి
తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి బిడ్డ ప్రాథమిక బాధ్యత
సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్
ఆకునూర్ గ్రామంలో ‘మన పోలీస్ – మన ఊరు’ కార్యక్రమం ప్రారంభం
సిద్దిపేట సురక్ష నేత్ర కింద సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవం
హెల్మెట్ల పంపిణీ.. క్రీడాకారులకు బహుమతుల ప్రదానం

కాకతీయ, చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని గ్రామాలను మరింత సురక్షితంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ ప్రజలతో పోలీసుల సత్సంబంధాలు పెంపొందించేందుకు ‘మన ఊరు.. మన పోలీస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామంలో పోలీస్ కమిషనర్ గ్రామస్తులతో మమేకమై భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కమిషనర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో కలిసి మొక్కలను నాటారు.

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

ఈ సందర్భంగా సీపీ సాధన రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వారిని గౌరవించడం మరియు సంరక్షించడం ప్రతి బిడ్డ బాధ్యత అని సూచించారు. యువతను మద్యానికి దూరంగా ఉంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సరైన మార్గంలో నడిపించాలని కోరారు. పోలీస్ శాఖ కేవలం చట్టాన్ని అమలు చేసే సంస్థ మాత్రమే కాదని, ప్రజలతో కలిసి మెరుగైన సమాజాన్ని నిర్మించే భాగస్వామి అని ఆమె పేర్కొన్నారు. రాబోయే 9 నుండి 10 నెలల్లో సిద్దిపేట జిల్లాలో సురక్షిత గ్రామాలను తయారు చేయడమే తన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు. ‘మన పోలీస్ – మన ఊరు’ ద్వారా తాము ప్రజల వద్దకు అధికారిక యంత్రాంగంలా కాకుండా, అభివృద్ధిలో భాగస్వాములుగా వస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వాలీబాల్ క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు, పలువురు ప్రయాణికులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ రమేష్ నాయక్, ఎస్ఐ అపూర్వ రెడ్డి, గ్రామ సర్పంచ్ కొమ్ము రవి, ఉప సర్పంచ్ కడారి పల్లవి, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.