ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలి
30వ తేదీలోపు చెల్లిస్తే 5 శాతం రిబేటు
మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ వెల్లడి
కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను దారులు ప్రభుత్వం కల్పించిన ‘ఎర్లీ బర్డ్’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కోరారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఈ నెల (ఏప్రిల్) 30వ తేదీలోపు ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ (రిబేటు) లభిస్తుందని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఈ గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. వివిధ బ్యాంకు మేనేజర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని, దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని గమనించాలని సూచించారు.

