టెన్త్ రిజల్ట్స్‌లో కుసుమ కోమల ప్రియ ప్రతిభ
540 మార్కులతో సత్తా చాటిన శ్రీవాణి హైస్కూల్ విద్యార్థిని
అభినందించిన పాఠశాల యాజమాన్యం
కాకతీయ, సిద్ధిపేట: పదో తరగతి ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా కేంద్రానికి చెందిన యుత్కం కుసుమ కోమల ప్రియ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. శ్రీవాణి హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థిని ఈరోజు వెలువడిన ఫలితాల్లో 540 మార్కులు సాధించి తన సత్తా చాటింది. విద్యార్థిని సాధించిన ఈ విజయంపై పాఠశాల ప్రిన్సిపల్ జి. నవీన్ కుమార్, కరస్పాండెంట్ సీహెచ్. సత్యం హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

