పుచ్చలపల్లి సుందరయ్య సేవలు చిరస్మరణీయం!
సీపీఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మాహో
కాకతీయ, చేర్యాల: ఉద్యమమే ఊపిరిగా ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేసిన అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య సేవలు చిరస్మరణీయమని సీపీఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మాహో అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం చేర్యాల పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొంగరి వెంకట్ మాహో మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించిన సుందరయ్య, తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకే అంకితమిచ్చిన గొప్ప ఆదర్శ నాయకుడన్నారు. భూస్వామ్య, దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా, ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో వెట్టిచాకిరి నిర్మూలన కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆనాడు రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి ప్రజా రక్షణ కోసం పోరాటం నడిపిన వీరుడని ప్రశంసించారు. ఆయన చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని, నేటి తరానికి ఆయన జీవితం ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, మండల కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, సీపీఎం నాయకులు పోలోజు శ్రీహరి, ఆముదాల నర్సిరెడ్డి, ముస్తాల ప్రభాకర్, బోయిని మల్లేశం, ఇప్పకాయల శోభ, రాళ్లబండి భాస్కర్, ఆముదాల రంజిత్ రెడ్డి, బొంగోని భాస్కర్, ఇప్పకాయల రాములు, తుపతి రాజు, తుమ్మలపల్లి అనిల్, బావల్లపల్లి రమ, నూర్ బి, బుట్టి మల్లయ్య, కనకయ్య, కాటం రాములు, చందు, అనిల్ కుమార్, నంగి మైసయ్య, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

