మృతుడి కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేత
కాకతీయ, చేర్యాల: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో కంపెనీ ద్వారా మృతుడి కుటుంబానికి కోటి రూపాయల బీమా చెక్కును టాటా ఏఐఏ కంపెనీ తరఫున సికింద్రాబాద్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ కె.పరమేశ్వర్ రెడ్డి ఆదివారం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన ఎస్. సత్యనారాయణ అనే వ్యక్తి టాటా ఏఐఏ కంపెనీ లో లైఫ్ ఇన్సూరెన్స్ బీమా తీసుకున్నాడు. ఇటీవల ఆయన మృతి చెందడంతో నామినీగా ఉన్న వారి సతీమణికి బీమా నగదు కోటి రూపాయల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ బ్రాంచ్ సినియర్ మేనేజర్ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో ఎవరికీ తెలియదని, అలాంటి సమయంలో కుటుంబానికి అండగా నిలిచేది బీమా పథకాలేనని అన్నారు. చిన్నమొత్తంలో ప్రీమియం చెల్లించుకుంటే పెద్ద మొత్తంలో కుటుంబానికి భరోసా లభిస్తుందన్నారు. ప్రతిఒక్కరు బీమా చేయించుకుంటే వారి కుటుంబానికి ఆర్ధిక భరోసా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో,బిజినెస్ పార్ట్నర్ చింతపల్లి శ్రీనివాసులు,చీఫ్ బిజినెస్ అసోసియేట్ బర్రె అమరేందర్ రెడ్డి, అడ్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

